చంద్రయాత్ర రాకెట్ ట్రావెల్స్.. తొలి టికెట్ బుక్కయిందట

- September 14, 2018 , by Maagulf
చంద్రయాత్ర రాకెట్ ట్రావెల్స్.. తొలి టికెట్ బుక్కయిందట

చంద్రుని మీదకు అమెరికా వ్యోమగాములు తొలిసారి వెళ్లారు. నీల్ ఆమ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ 1969లో చంద్రునిపై కాలుమోపి చరిత్రకెక్కారు. 1972లో చివరియాత్ర జరిగింది. మొత్తం 24 మంది మాత్రమే చంద్రయాత్ర చేశారు. వారంతా వ్యోమగాములుగా శిక్షణ పొందినవారు. ఆ తర్వాత, మానవరహిత రాకెట్లు మాత్రమే చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్-ఎక్స్ కంపెనీ చంద్రుని మీదకు రాకెట్ ట్రావెల్ సర్వీస్ ప్రారంభించింది. కాకలుతీరిన వ్యోమగాములేమిటి.. సామాన్యులూ చంద్రమండల యాత్ర చేసి తరించవచ్చని టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. అప్పుడే ఓ టిక్కెట్ అమ్ముడైంది కూడా. ఈ యాత్ర కోసం బిగ్ ఫాల్కన్ రాకెట్ అనేదానిని తయారు చేశారు. తొలి పర్యాటకుడు ఎవరో సెప్టెంబర్ 17న ప్రకటిస్తామని టెస్లా కంపెనీ సీఈవో కూడా అయిన మస్క్ ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ఈ యాత్రలో కేవలం చంద్రుని చుట్టూ రాకెట్‌లో చక్కర్లు కొట్టడమే ఉంటుంది. కిందకు దిగితే ఎదురయ్యే ఇబ్బందులు మామూలు ప్రయాణికులైతే తట్టుకోలేరని ఇలా ప్లాన్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com