ఫేస్ బుక్‌లో పోర్న్ వీడియో పోస్టింగ్: వ్యక్తిపై అభియోగాలు
September 18, 2018
ఓ యువకుడిపై ఫోస్బుక్లో పోర్న్ వీడియో పోస్ట్ చేసినట్లు అభియోగాలు నమోదు కావడంతో, రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్ట్ యెదుట అతన్ని హాజరు పరిచారు పోలీసులు. ఓ మహిళకు చెందిన పోర్న్ వీడియోని షేర్ చేసి, ఆ మహిళకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడు అరబ్ జాతీయుడు. అయితే, తాను ఎలాంటి న్యూడ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని నిందితుడు తన వాదనను విన్పించాడు. 'నేను ఇతరుల్లాగానే వీడియో చూశాను. అయితే దాన్ని ఎవరికీ షేర్ చేయలేదు' అని పేర్కొన్నాడు నిందితుడు. సోషల్ మీడియాలో తన వాయిస్‌తో ఓ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశాను తప్ప, అందులో మహిళకు వ్యతిరేకంగా ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలూ చేయలేదని అన్నాడు. న్యాయస్థానం కేసు విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది.