ధావన్ ఇరగదీసిండు

- September 18, 2018 , by Maagulf
ధావన్ ఇరగదీసిండు

ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్‌-ఏలో భారత్ -హాంకాంగ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ జోరు చూపించాడు. టాస్‌ ఓడి భారత్‌ బ్యాటింగ్‌కు దిగగా... నిర్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీ, అంబటి రాయుడు అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 127 పరుగులతో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు ధావన్... తొలి పవర్‌ ప్లే నుంచే రోహిత్‌ శర్మ, ధవన్‌ ధాటిగా ఆడారు. మొదటి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రాయుడు 70 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 60తో చెలరేగి ధావన్‌కు మంచి సహకారం అందించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఫోర్లు, సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక రాయుగు ఔట్ కావడంతో దినేష్‌ కార్తీక్‌ (33)తో కలసి ధావన్‌ బ్యాటింగ్ కొనసాగించాడు... 36వ ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌తో వన్డే కెరీర్‌లో 14వ సెంచరీ నమోదు చేసిన ధావన్... ఆ తర్వాత ఫోర్‌, సిక్సర్‌తో మరింత వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు... కానీ, ఆఫ్‌ స్పిన్నర్‌ కించిత్‌ షా బౌలింగ్‌లో తన్వీర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

పసికూనలపై విజయం నల్లేరుపై నడకేనని భావించినా... హాంకాంగ్ కుర్రాళ్లు హడలెత్తించారు. టీమిండియాపై మంచి పోరాటపటిమను చూపించారు. ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా ఊపిరిపీల్చుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com