అమెరికాలో ఆ విషయంలో మనమే టాప్

అమెరికాలో ఆ విషయంలో మనమే టాప్

అమెరికా పౌరసత్వం.. చాలామందికి అదోక కల. అందుకు తగ్గట్టుగానే.. ఆ దేశ పౌరసత్వం పొందడం కూడా చాలా కష్టం. ఎన్నో దేశాలకు చెందిన వ్యక్తులు యూఎస్‌ పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ.. అమెరికాలో భారతీయుల పరిస్థితి మరోలా ఉంది. గతేడాది అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య పెరిగింది. 2016తో పోల్చితే 2017లో 10 శాతం మేర వృద్ధి కినిపించింది. ఏకంగా 50 వేల మంది ఆ దేశ పౌరసత్వం పొందారు. ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందిన మిగతా దేశస్థుల సంఖ్య తగ్గింది. 2016తో పోల్చితే 2017లో 6 శాతం పడిపోయింది. 2016-17 మధ్య అమెరికా పౌరసత్వం పొందినవారిలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉండగా.. మనోళ్లు రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 7 లక్షల మందికి అమెరికా పౌరసత్వం లభించగా.. అందులో భారతీయులు 7 శాతం మంది ఉన్నారు.

Back to Top