భేటీ అవ్వనున్న భారత్‌, పాక్‌

- September 19, 2018 , by Maagulf
భేటీ అవ్వనున్న భారత్‌, పాక్‌

పాకిస్తాన్‌ తో చర్చలకు భారత ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంతో పొరుగుదేశాలతో స్నేహం సాధారణ స్థాయిలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో ఈనెల 26వ తేదీన భారత్, పాక్‌ విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ పాకిస్తాన్‌ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య మళ్ళీ సంప్రదింపుల ప్రక్రియ మొదలయ్యేందుకు ఈ లేఖతో శ్రీకారం చుట్టారు. ఈనెల 27వ తేదీన సార్క్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగనుంది. ఆ భేటీకి ఒక రోజు ముందు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ఖురేషి భేటీ అవుతారు. మరోవైపు వివిధ రకాల వస్తువులతో భారత ట్రక్కులు తమ దేశం గుండా ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్ళేందుకు పాకిస్తాన్ అంగీకరించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com