దాల్చిన చెక్క పొడితో ఉపయోగాలు

- October 01, 2018 , by Maagulf
దాల్చిన చెక్క పొడితో ఉపయోగాలు

దాల్చిన చెక్కని ఆహారపదార్థాల, వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. అనేక రోగాలను నిర్మూలిస్తుంది.

1. ఒక గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబూ, దగ్గు తగ్గుతాయి.
 
2. ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి, రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగుతుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి తీసిన గంధాన్ని పట్టిస్తుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.
 
3. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని రోజూ రెండుసార్లు ఆహారం తరువాత అర గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
 
4. పావు కప్పు ఆలివ్ నూనెను వేడిచేసి మూడు స్పూన్ల తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వారానికి ఒకటి రెండు సార్లు ఈ విధంగా చేయాలి.
 
5. దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం అరచెంచా పొడిని పావు గ్లాసు నీరు లేదా పాలల్లో కలిపి తాగడం వల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com