హెచ్చరిక.. హరికెన్ బీభత్సం సృష్టించే అవకాశం..

హెచ్చరిక.. హరికెన్ బీభత్సం సృష్టించే అవకాశం..

అమెరికాలోని ఫ్లోరిడా పై మిచ్చెల్ హరికెన్ విరుచుకుపడే అవకాశం ఉందని నేషనల్ హరికెన్ సెంటర్ హెచ్చరికలు జారీచేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాచక చర్యలు ముమ్మరం చేశారు. హరికెన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ తెలిపారు. అయితే ఇప్పటికే నేషనల్ హరికెన్ సెంటర్ మిచ్చెల్ హరికెన్ ను కెటగిరి 4గా ప్రకటించి అప్రమత్తం చేసింది. దీని ప్రభావం జార్జియా, అలబామా ప్రాంతాలపై కూడా ఉండవచ్చని అధికారులు వెల్లడించారు. మచ్చెల్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో సహాయకచర్యలను చేపట్టేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.

Back to Top