బుర్జ్‌ ఖలీఫాలో న్యూ ఇయర్‌ ఫైర్‌ వర్క్స్‌

బుర్జ్‌ ఖలీఫాలో న్యూ ఇయర్‌ ఫైర్‌ వర్క్స్‌

దుబాయ్: పబ్లిక్‌ డిమాండ్‌ నేపథ్యంలో బుర్జ్‌ ఖలీఫా ఈ ఏడాది డిసెంబర్‌ 31న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫైర్‌ వర్క్స్‌ వెలుగుల్లో నిండిపోనుంది. ఎమ్మార్‌ సంస్థ, కళ్ళు చెదిరే రీతిలో న్యూ ఇయర్‌ ఈవెంట్‌ సెలబ్రేషన్‌కి రంగం సిద్ధం చేస్తోంది. బుర్జ్‌ ఖలీఫా, అలాగే దుబాయ్‌ ఫౌంటెయిన్‌ వద్ద ఫెస్టివల్స్‌ అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. వరల్డ్‌ క్లాస్‌ ఎక్స్‌పర్ట్స్‌తో ఈ ఫైర్‌ వర్క్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ విజువల్స్‌ని తిలకించేందుకోసం ప్లాట్‌ఫామ్స్‌ ఏర్పాటు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూపించోతున్నారు. అలాగే దుబాయ్‌ డౌన్‌టౌన్‌లో ప్రత్యేకంగా బిగ్‌ స్క్రీన్స్‌లోనూ వీటిని ప్రదర్శించబోతున్నారు. మై దుబాయ్‌ న్యూ ఇయర్‌ వెబ్‌సైట్‌లోనూ లైవ్‌ ప్రసారాల్ని తిలకించేందుకు వీలుంది. 

Back to Top