ఇల్లీగల్‌ కార్‌ వాష్‌: 500 దిర్హామ్‌ల జరీమానా

ఇల్లీగల్‌ కార్‌ వాష్‌: 500 దిర్హామ్‌ల జరీమానా

షార్జా: ఇల్లీగల్‌ కార్‌ వాష్‌కిగాను 500 దిర్హామ్‌ల జరీమానా విధిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్‌ ప్రాంతాల్లో, స్ట్రీట్స్‌పైనా, రెసిడెన్షియల్‌ ఏరియాస్‌లోనూ ఇల్లీగల్‌ కార్‌ వాష్‌ చేయించినందుకుగాను మొత్తం 681 మంది కార్‌ ఓనర్లకు గత క్వార్టర్‌లో జరీమానాలు విధించారు. ఇల్లీగల్‌ కార్‌ వాషింగ్‌కి 250 నుంచి 500 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. వాచ్‌మెన్‌, ఇల్లీగల్‌ వర్కర్స్‌, ఇతరులు సాయంత్రం వేళల్లో భవనాల వద్ద, ఇతర పబ్లిక్‌ ప్రాంతాల్లో కార్లను వాష్‌ చేస్తున్నారని ఇన్‌స్పెక్షన్‌ టీమ్స్‌ గుర్తించాయి. ఈ నేపథ్యంలో తనిఖీల్ని మరింత ముమ్మరం చేసి, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

 

Back to Top