గంగా నది ప్రక్షాళన ఉద్యమకారుడు అగర్వాల్ కన్నుమూత

గంగా నది ప్రక్షాళన ఉద్యమకారుడు అగర్వాల్ కన్నుమూత

గంగా నది ప్రక్షాళన కోసం నిరాహార దీక్ష చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త జేడీ అగర్వాల్ (86) కన్నుమూశారు. 109 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయనను ఇటీవల ఉత్తరాఖండ్‌ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడే ఆయన ప్రాణం విడిచారు. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిని పరిశుభ్రపరచాలని 2008 నుంచి అగర్వాల్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇటీవల చేసింది ఆరో దీక్ష. జేడీ అగర్వాల్‌ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.

Back to Top