క్లాస్‌ రూమ్‌లో అగ్ని ప్రమాదం: ఏడుగురు విద్యార్థులకు గాయాలు

క్లాస్‌ రూమ్‌లో అగ్ని ప్రమాదం: ఏడుగురు విద్యార్థులకు గాయాలు

మస్కట్‌: ఏడుగురు విద్యార్థినులు, క్లాస్‌రూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. సోహార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ మరియు అంబులెన్స్‌ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రెస్క్యూ అథారిటీస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడం జరిగింది. గాయపడ్డ విద్యార్థుల్ని ఆసుపత్రికి తరలించారు. పొగ పీల్చడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి వర్గాఉల వెల్లడించాయి. విలాయత్‌ ఆఫ్‌ సోహార్‌లోని అల్‌ అవాఐనత్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం విద్యార్థినులను అవైనాత్‌ హెల్త్‌ సెంటర్‌కి తరలించినట్లు పిఎసిడిఎ పేర్కొంది. 

Back to Top