ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఒమనీ విద్యార్థుల మృతి
October 11, 2018
మస్కట్: ఫ్లోరిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరు ఒమనీ స్టూడెంట్స్‌ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారని ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంది. మృతి చెందినవారిని మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ మషారి, మొహమ్మద్ బిన్ సౌద్ అల్ తోబిగా గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ చనిపోయారని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంటూ, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మినిస్ట్రీ తెలిపింది. గాయపడ్డ విద్యార్థి వకాస్ అల్ సియాబీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది.