స్మగ్లర్‌ని పట్టుకున్న అండర్‌ కవర్‌ ఏజెంట్‌

స్మగ్లర్‌ని పట్టుకున్న అండర్‌ కవర్‌ ఏజెంట్‌

20కిలోల డ్రగ్స్‌ని స్మగుల్‌ చేస్తున్న వ్యక్తిని అండర్‌ కవర్‌ ఏజెంట్‌ చాకచక్యంగా పట్టుకోగలిగారు. నిందితుడ్ని అబుదాబీ క్రిమినల్‌ కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఎమిరేటీ వ్యక్తి ఈ కేసులో నిందితుడు. పక్కా సమాచారంతో నిందితుడిపై నిఘా పెట్టారు అధికారులు. అండర్‌ కవర్‌ ఏజెంట్‌, డ్రగ్స్‌ డీలర్‌ని ఫోన్‌ ద్వారా సంప్రదించగా, 20 కిలోల హాషిష్‌ని విక్రయించేందుకు సదరు డీలర్‌ అంగీకరించాడు. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా మీటింగ్‌ ప్లేస్‌ నిర్ణయం కూడా జరిగింది. 20 కిలోలకు బదులుగా డీలర్‌, 19 కిలోల హాషిష్‌ ఇవ్వడానికి ఆ తర్వాత అంగీకరించడం జరిగింది. అత్యంత వ్యూహాత్మకంగా వలపన్నిన అధికారులు, అండర్‌ కవర్‌ ఏజెంట్‌ ద్వారా నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. విచారణలో నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి, అతని ఇంటి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 29కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.

Back to Top