షార్జా:'ETCA' వారి బతుకమ్మ సంబరాలు

- October 14, 2018 , by Maagulf

షార్జా:తేదీ 12 అక్టోబర్ 2018 శుక్రవారం రోజున ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం(ETCA) మరియు తెెెలంగాణ జాగృతి UAE శాఖ సంయుక్త ఆధ్వర్యంలో షార్జా లోని స్కై లైన్ యూనివర్సిటీ వేదికగా సుమారు 8000 మంది భారీ జన సందోహం నడుమ  తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించేలా  సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు 'బతుకమ్మ సంబరాలు' ఎంతో అట్టహాసంగా జరిగాయి. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత వ్యాపారవేత్త తోట రామ్ కుమార్,  ETCA  అధ్యక్ష్యులు రాధారపు సత్యం , ETCA వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్, మహాశ్వేత ఫుడ్ స్టఫ్ మేనేజింగ్ పార్టనర్ మంచుకొండ వెంకటేశ్వరులు, సూపర్ జెట్ గ్రూప్ ఎండి మసియుద్దీన్, యునిఫోర్స్ కాంట్రాక్టింగ్ పార్టనర్ కిష్టయ్య మరియు  పలువురు తెలంగాణ వ్యాపార   ప్రతినిథులు మరియు పలు తెలంగాణ సంఘాల, తెలుగు సంఘాల  ప్రముఖులు పాల్గొన్నారు.   

ముందుగా కళాకారులు డప్పు వాయుద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొన్నాక ETCA మరియు  జాగృతి UAE  మహిళా సభ్యులందరూ కలిసి గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది.తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో అందమైన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరు కావడం మరియు బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడటంతో వేదిక అంతా గొప్ప పండగ వాతావరణంతో  నిండి పోయింది. ఇతర రాష్ట్రాల నుండి కూడ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు , ఆరబ్స్ సైతం అట్టహాసంతో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సందడి చేసారు . యూనివర్సిటీ లోని విద్యార్థులు సైతం కమ్మని పాటల ను వింటూ రంగు రంగుల పుష్పాలతో తయారుచేసిన బతుకమ్మలను సెల్ ఫోన్స్ లో ఫోటోలు  తీస్తూ ఆనందించారు.


ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా  ప్రముఖ గాయని తేలు విజయ , గాయకులు అష్ట గంగాధర్ , గాయకుడు ఉమేష్  పాల్గొన్నారు.వేడుకల్లో గాయని తేలు విజయ  మరియు అష్ట గంగాధర్ పాడిన  పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసాయి.తేలు విజయ మరియు సౌమ్య రెడ్డి మహిళలందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు.  తెలంగాణ తలమానికమైన బతుకమ్మ సంబరాలను గొప్పగా జరుపుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేశారు.  

ఈ సందర్భంగా మహిళలు తీసుకొచ్చిన  రంగు రంగు పూల బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. నిర్వాహకులు అందమైన పది బతుకమ్మలను ఎంపిక చేసి  బహుమతులు ప్రదానం చేశారు. అంతే కాకుండా బతుకమ్మ పాటల పోటీలు, సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ETCA మహిళా సభ్యులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ ప్రసాదంను అందజేయడం జరిగింది.

ఈ వేడుకకు ఎస్.ఆర్.ఆర్ బిల్డింగ్ ట్రేడింగ్ మెయిన్ స్పాన్సర్ కాగా,ఎల్.ఎస్.ఎమ్.పి.కె గ్రూప్ గోల్డ్  స్పాన్సర్ గా , యునిఫోర్స్ కాంట్రాక్టింగ్, ఎస్జెటి సూపర్ జెట్ గ్రూప్ సిల్వర్ స్పాన్సర్ గా , జనరల్ స్పాన్సర్స్ గా  ఆశ్రిత్ టెక్నికల్ సర్వీసెస్, సెవెన్ హిల్స్, వి స్ మార్ట్,  జిబిఆర్, న్యూ డైమండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, మిలాన్ గ్రూప్, ఎస్ ఎస్ పయనీర్ ఎలెక్ర్టో మెకానికల్ వర్క్స్ , నిర్మాన్, రియల్ టేస్ట్ రెస్టారెంట్, మహ శ్వేత ఫుడ్స్ , స్ప్రింట్ వాటర్ , అల్మరాయ్, లిప్టన్ వారు ఇతర స్పాన్సర్స్ గా వ్యవహరించారు.

T న్యూస్,V6 న్యూస్, TV5, వాయిస్ ఆఫ్ యువర్ పేజ్, మా గల్ఫ్ లు మీడియా పార్ట్నర్స్ గా ఉన్నారు. 


రియల్ టేస్ట్ రెస్టారెంట్ సిబ్బంది వారిచే తయారు చేయబడిన బతుకమ్మ ప్రసాదంను కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. ఇందుకు సహకరించిన రియల్ టేస్ట్ రెస్టారెంట్ యాజమాన్యానికి , వస్తువులను సమకూర్చిన మహాశ్వేత ఫుడ్ స్టఫ్ ట్రేడింగ్ వెంకటేశ్వరులు మంచుకొండ గారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ సంబరాల్లో ETCA అధ్యక్షులు సత్యం రాధారపు , ETCA వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర , ముఖ్య స్పాన్సర్ అయిన ఎస్.ఆర్. ఆర్ గ్రూప్ ఛైర్మన్ తోట రామ్ కుమార్ , జాగృతి అధ్యక్ష్యులు సాయి చందర్,  ఉపాధ్యక్ష్యులు దీపిక ఎలిగేటి  , ETCA   ఉపాధ్యక్ష్యులు రాగం అరవింద్ బాబు , జనరల్ సెక్రటరీ నరేశ్ కుమార్, జాగృతి జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి  మహిళా విభాగం సభ్యులు రిషిత , అల్లూరి సరోజ, స్కై లైన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కోటా రెడ్డి , సీనియర్ రిపోర్టర్ చంద్రప్రకాశ్ ,  ETCA ఇతర సభ్యులు మరియు తెలంగాణ జాగృతి యు.ఎ.ఇ  శాఖ సభ్యులు తగు విధాలుగా తమ బాధ్యతలను నిర్వర్తించి కార్యక్రమం విజయవంతంగా కావడానికి కృషి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com