అల్లంతో కీళ్లనొప్పులకు చెక్..

- October 15, 2018 , by Maagulf
అల్లంతో కీళ్లనొప్పులకు చెక్..

కీళ్లనొప్పులతో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ అల్లాన్ని వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. దీనిని ఆరోగ్యానికి, అందానికి కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ 4 గ్రాముల అల్లాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే అల్లం టీ తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
అధిక బరువును తగ్గిస్తుంది. కడుపు నొప్పి, వాంతులు వస్తున్నప్పుడు కొద్దిగా అల్లాన్ని పటిక బెల్లంలో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పలు రకరకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఇలా చేయాలి.. అల్లాన్ని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com