బ్రిటన్ పార్లమెంట్లో రోబో.!

- October 19, 2018 , by Maagulf
బ్రిటన్ పార్లమెంట్లో రోబో.!

బ్రిటన్‌ పార్లమెంట్‌కు తొలిసారిగా ఓ రోబో వచ్చింది. విద్యాసంస్థలు తరగతి గదుల్లో అనుసరించాల్సిన నూతన సాంకేతిక విద్యా విధానాలను ఎంపీలకు వివరించేందుకు రోబోను పార్లమెంట్‌కు తీసుకురావడం విశేషం. సాంకేతిక విద్య ప్రాధాన్యత, పారిశ్రామిక విప్లవం గురించి పలువురు ఎంపీలు ప్రశ్నించగా రోబో సవివరంగా సమాధానాలు చెప్పింది. రోబోల అభివృద్ధి కోసం పలు సాఫ్ట్‌స్కిల్స్‌ ప్రవేశపెట్టేందుకు ఎంపీలంతా కృషి చేయాలని రోబో కోరడంతో ఆశ్చర్యపోవడం పార్లమెంట్‌ సభ్యుల వంతైంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపీలకు వివరించేందుకు రోబోను పార్లమెంట్‌ కమిటీ సభ్యుల ముందుకు తీసుకొచ్చినట్టు రోబోటిసిస్ట్‌ డాక్టర్‌ అలీ షాఫ్టీ చెప్పారు. తాను లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌లో పనిచేస్తున్నానని, రోబోల సాయంతో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చొని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com