త్వరలో నింగిలో చైనా మూన్ దర్శనమిస్తుందిట!

- October 20, 2018 , by Maagulf
త్వరలో నింగిలో చైనా మూన్ దర్శనమిస్తుందిట!

ఆకాశంలో మరో అద్భుతం చేసేందుకు చైనా రంగం సిద్ధం చేస్తోంది. సొంతంగా కృత్రిమ చందమామను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది 2020 కల్లా పూర్తి చేయాలనే ధృడ నిశ్చయంతో చైనా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ కృత్రిమ చంద్రుడిని ప్రవేశ పెట్టడం ద్వారా వీధి లైట్లకు చెక్ పెట్టి తద్వారా విద్యుత్‌కు అయ్యే ఖర్చును ఆదా చేయాలని భావిస్తోంది డ్రాగన్ కంట్రీ.

చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూ నగరంలో ఈ కృత్రిమ చంద్రులను తయారు చేస్తున్నారు. ఇది సహజ చంద్రుడు ఎంత వెలుగైతే ఇస్తాడో అంతకంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఈ కృత్రిమ చంద్రుడు కాంతిని ఇస్తాడని అధికారులు వెల్లడించారు. మానవుడు తయారు చేసిన తొలి చంద్రుడిని సిచువాన్‌లోని క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి పంపనున్నారు. ఆ తర్వాత 2022 నాటికి మరో మూడు కృత్రిమ చంద్రులను ఆకాశంలోకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది చైనా.

మొదటి చంద్రడు కేవలం ప్రయోగం కోసమేనని చెప్పిన శాస్త్రవేత్తలు ఇది విజయవంతం అయితే మరో మూడు చంద్రులను నింగిలోకి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ కృత్రిమ చంద్రుడిని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తర్వాత సూర్యకాంతి దీనిపై పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక రాత్రి వేళల్లో ఈ చంద్రుడి నుంచి విడుదలయ్యే కాంతితో స్ట్రీట్ లైట్లతో పని ఉండదని చెప్పారు. ఇలా ఊటా 170 మిలియన్ డాలర్లు మేరా విద్యుత్ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఈ కృత్రిమ చంద్రుడు 50 చదరపు కిలోమీటర్ల మేరా కాంతిని వెదజల్లుతుందని చెప్పారు. అంతేకాదు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కరెంట్ లేని సమయంలో సహాయక చర్యలు ముందుకు సాగేందుకు ఈ కృత్రిమ చంద్రుడునుంచి విడుదలయ్యే కాంతి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com