పాలకూర సూప్‌తో ఉపయోగాలు
- October 25, 2018కొందరైతే ఏది దొరికితే అది తినేస్తుంటారు. దాంతో అజీర్తి సమస్యతో బాధపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే మరికొందరు ఏది తిన్నా కూడా జీర్ణం కాదు. ఈ సమస్యను తొలగించుకోవడానికి రకరకాల మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించదు. కనుక ఫైబర్ అధికంగా గల ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం..
పచ్చి బఠానీలు, బీన్స్ వంటి కూరగాయలల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని ఎలా తీసుకోవాలంటే పచ్చి బఠానీలను నానబెట్టి ఉడికించుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. బీన్స్‌ను కూర రూపంలో కంటే వేపుడుగా తీసుకుంటే వాటిలోని విటమిన్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
క్యారెట్స్‌లో శరీరానికి కావలసినంత ఫైబర్ లభిస్తుంది. 100 గ్రాముల క్యారెట్స్‌లో 2.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్యారెట్స్‌ను పచ్చిగా తీసుకుంటే మంచిది. అలానే పాలకూర, దీనిలోని విటమిన్ ఎ, బి, సి, కె, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అజీర్తిని తొలగిస్తాయి.
పాలకూరను కూరగా తీసుకునేందుకు చిన్నారులు, పెద్దలు అందగా ఇష్టపడరు. అందువలన దీనిని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి పాలకూర సూప్ ఎలా చేయాలో చూద్దాం.. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసుకుని సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్‌లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్