క్యాలీ ఫ్లవర్ పువ్వు రసాన్ని తీసుకుంటే అవి తగ్గిపోతాయ్...

- November 03, 2018 , by Maagulf
క్యాలీ ఫ్లవర్ పువ్వు రసాన్ని తీసుకుంటే అవి తగ్గిపోతాయ్...

మనం కొన్ని పదార్థాలు ఇష్టంగా తింటాం. కొన్ని పదార్థాలు నచ్చక వదిలేస్తాము. కానీ ఆ నచ్చని పదార్థాలలో మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. అలాంటప్పుడు అవి నచ్చకపోయినా మనకు నచ్చే రీతిలో తయారుచేసుకుని మన ఆరోగ్యం కోసమైన తినాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో కాలీఫ్లవర్ ఒకటి. కాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వండేటప్పుడు దాని వాసన అంత బాగుండదు. కానీ కాస్త మసాలా దట్టించి వండితే అద్భుతమైన రుచిని చూడవచ్చు. కాలీప్లవర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 
1. తాజా పువ్వు రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు చొప్పున రెండుమూడు మాసాల పాటు సేవిస్తుంటే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి.
 
2. కాలిఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌, ఇంకా బ్లాడర్‌ క్యాన్సర్‌ వంటి పలు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
 
3. కాలిఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు స్వీకరిస్తుంటే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి. 
 
4. గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ కాలిఫ్లవర్‌ పువ్వు ఆకుల రసం సేవిస్తుంటే పిండం ఆరోగ్యంగా ఉండి, వెంటవెంటనే గర్భధారణ కాకుండా ఉంటుంది. 
 
5. కాలిఫ్లవర్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్‌ బారి నుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తుంది. కాలిఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్‌, ధయోసయనేట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి.
 
6. స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలిఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్‌లో కావలసిన శక్తి లభిస్తుంది. కాలిఫ్లవర్‌లో విటమిన్ సి కాల్షియమ్ కూడా లభిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com