ఇండియా:ఈ-టిక్కెట్ రిజర్వేషన్‌లో మోసాలు..

- November 05, 2018 , by Maagulf
ఇండియా:ఈ-టిక్కెట్ రిజర్వేషన్‌లో మోసాలు..

ఇండియా:రిజర్వేషన్ కౌంటర్‌కి వెళ్లి బుక్ చేసే రోజులకు కాలం చెల్లింది. అంతా ఆన్‌లైన్‌లోనే. ఊరెళ్లాలన్నా, రావాలన్నా అరచేతిలో మొబైల్. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్. నిమిషాల్లో పనైపోతుంది. ప్రయాణీకుడి అవసరాన్ని ఆసరాగా తీసుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి వాటి ద్వారా ఈ టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. నిజమే అనుకుని డబ్బులు చెల్లించి ప్రయాణీకులు మోసపోతున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే శాఖ తన పరిధిలోని పలు ప్రాంతాల్లో టిక్కెట్ రిజర్వేషన్ కల్పించింది. అయితే కొంత మంది నకిలీ ఖాతాల ద్వారా టికెట్ రిజర్వ్ చేస్తూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నట్లు రైల్వే అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

దీనిపై స్పందించిన రైల్వే శాఖ వీటిపై తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా రైల్వే భద్రత విభాగం డైరక్టర్ జనరల్ అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు దక్షిణ రైల్వే పరిధిలో ఉన్న 49 ప్రాంతాల్లో శనివారం రైల్వే పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో భాగంగా మోసాలకు పాల్పిడిన 17 మందిని గుర్తించి అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 137 నకిలీ గుర్తింపు కార్డులు, రూ. 4.85 లక్షల విలువ చేసే 310 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com