వాట్సప్‌లో కొత్తగా వచ్చిన మార్పులు..

- November 06, 2018 , by Maagulf
వాట్సప్‌లో కొత్తగా వచ్చిన మార్పులు..

మన రోజువారీ జీవితంలో వాట్సాప్‌ ఓ భాగమై పోయింది. చాటింగ్‌కు చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా వాట్సాప్‌కే క్రేజ్‌ ఎక్కువ. టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఫొటోలను వాట్సాప్‌ ద్వారా సులభంగా పంపుకోవచ్చు. ఈ సౌలభ్యమే ఈ యాప్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవడానికి ఓ కారణం.అందుకే వాట్సాప్ అనేక కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. వీటిలో కొన్ని చిన్న చిన్నవి కాగా మరి కొన్ని కీలకమైన మార్పులు. ఈ నేపథ్యంలో తాజాగా మరో చిన్న మార్పు తీసుకువచ్చింది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో...
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో వాట్సాప్ బేటా 2.18.325 వెర్షన్ వాడుతున్న వారికి ప్రస్తుతం ఇది వర్తిస్తుంది. ఇకపై ఒకరికంటే ఎక్కువ మందికి ఏదైనా మెసేజీ ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు అవి నేరుగా ఫార్వర్డ్ చేయడానికి ముందు వాట్సాప్ప మనకు ఒక ప్రివ్యూ చూపించబోతోంది. ఒకవేళ ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయాలా లేదా అన్నది అప్పటికప్పుడు నిర్ణయించుకోవచ్చు, వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు.

ఫేక్ న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అవకుండా...
ఫేక్ న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అవకుండా అడ్డుకోవడం కోసం వాట్సాప్ కొద్ది నెలల నుండి గరిష్టంగా ఐదు మందికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలిగే విధంగా పరిమితి విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వాట్సప్‌ని ఆధారంగా చేసుకొని పని చేసే థర్డ్-పార్టీ యాప్స్ విషయంలో కూడా కఠినమైన నిబంధనలను వాట్సప్ విధించడం జరిగింది.

ఇతర అప్లికేషన్లు తమ టైటిల్‌లో వాట్సప్ అనే పదాన్ని కలిగి ఉండకూడదు...
దీనిలో భాగంగా ఇకపై ఇతర అప్లికేషన్లు తమ టైటిల్‌లో వాట్సప్ అనే పదాన్ని కలిగి ఉండకూడదు. వాట్సప్ అర్థం ధ్వనించే విధంగా Whatsap, Watsapp, WutsApp, wazapp, watapp, wutzap, watzapp, ZapZap వంటి ఇతర పేర్లను కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ కలిగి ఉండకూడదు.

వాట్సాప్ లోగోని, కంపెనీ పేరులను ఇతర యాప్స్ కలిగి ఉండకూడదు...
అలాగే వాట్సాప్ లోగోని, కంపెనీ పేరులను ఇతర యాప్స్ కలిగి ఉండకూడదు. వాట్సప్ టెలీఫోన్ లోగోని వినియోగించకూడదు. వాట్సప్ లోగోని ఎడిట్, మాడిఫై, రొటేషన్, కలర్ మార్చటం లాంటి పనులు చేయకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com