అంతరిక్షంలోకి మరో యూఏఈ శాటిలైట్‌!

- November 07, 2018 , by Maagulf
అంతరిక్షంలోకి మరో యూఏఈ శాటిలైట్‌!

మైశాట్‌-1 పేరుతో యూఏఈకి చెందిన స్టూడెంట్స్‌ తయారు చేసిన నానో శాటిలైట్‌ ఈ నెలలోనే అంతరిక్షంలోకి వెళ్ళనుంది. గత నెలలో అంటే అక్టోబర్‌లో 29వ తేదీన దేశానికి చెందిన ఖలీఫా శాటిలైట్‌, జపాన్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆకాంశంలోకి దూసుకెళ్ళిన సంగతి తెల్సిందే. కాగా, 20 మంది విద్యార్థులు, మైశాట్‌-1 శాటిలైట్‌ని రూపొందించారు. ఖలీఫా యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్‌, భూమిని ఫొటోలు తీయనుంది. ప్రధానంగా ఎడ్యుకేషనల్‌ పర్పస్‌ కోసం దీన్ని రూపొందించారు. నార్త్‌ట్రాప్‌ గ్రుమ్‌నాన్‌ సంస్థ తయారు చేసిన స్పేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా మైశాట్‌-1 ఉపగ్రహాన్ని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కి పంపిస్తారు. మైశాట్‌-1 బరువు 1.3 కిలోలు. మస్దార్‌ సిటీలోని యహ్‌శాట్‌ స్పేస్‌ ల్యాబ్‌లో దీన్ని రూపొందించారు. మస్దార్‌ ఇన్‌స్టిట్యూట్‌ డెవలప్‌ చేసిన బ్యాటరీతోపాటు, కెమెరా ఇందులోని ప్రధాన భాగాలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com