ప్రొఫెట్‌ మొహమ్మద్‌ బర్త్‌డే: మూడు రోజుల వీకెండ్‌

ప్రొఫెట్‌ మొహమ్మద్‌ బర్త్‌డే: మూడు రోజుల వీకెండ్‌

యూఏఈ రెసిడెంట్స్‌ 3 రోజుల వీకెండ్‌ని ఎంజాయ్‌ చేసే అవకాశం దక్కింది. నవంబర్‌ 18వ తేదీన ప్రొఫెట్‌ మొహమ్మద్‌ పుట్టినరోజు సందర్భంగా సెలవు కావడంతో, రెగ్యులర్‌ వర్క్‌ నవంబర్‌ 19 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ పబ్లిక్‌, ప్రైవేట్‌ సంస్థలకు నవంబర్‌ 18వ తేదీని సెలవుగా ప్రకటించారు ఇప్పటికే. లాంగ్‌ వీకెండ్‌ నేపథ్యంలో యూఏఈ రెసిడెంట్స్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే ప్రొఫెట్‌ మొహమ్మద్‌ బర్త్‌డే సందర్భంగా ముందస్తుగా పలువురు ప్రముఖులు యూఏఈ రెసిడెంట్స్‌ అలాగే ముస్లిం దేశాల్లోని ప్రజలు, ఆయా దేశాలకు శుభాకాంక్షలు తెలిపారు. 

Back to Top