దివాలీ రాఫెల్: 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న పాకిస్తానీ మహిళ

దివాలీ రాఫెల్: 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న పాకిస్తానీ మహిళ

 రాఫెల్ టిక్కెట్లపై 40,000 దిర్హామ్‌లు ఖర్చు చేస్తూ వచ్చిన ఓ యూఏఈ రెసిడెంట్‌ ఎట్టకేలకు 1 మిలియన్‌ డాలర్స్‌ని గెల్చుకోవడం జరిగింది. రఫాలె గెల్చుకున్న ఆనందంతో ఆ విజేత షాక్‌కి గురయ్యారట. పాకిస్తానీ జాతీయురాలు ఫెహ్మిదా తన్వీర్‌ ఈ బహుమతిని గెల్చుకున్నారు. పన్నెండేళ్ళుగా దుబాయ్‌లో నివసిస్తోన్న తన్వీర్‌, హౌస్‌వైఫ్‌. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద జరిగిన డ్రా ఈవెంట్‌లో ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ పాల్గొన్నారు. సంప్రదాయ ఇండియన్‌ డాన్స్‌ (కథక్‌) ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రీవియస్‌ విన్నర్‌ సౌరవ్‌ డేకి ప్రెజెంటేషన్‌ అందించారు. కాగా, కువైట్‌కి చెందిన ఫైసల్‌ సలీమ్‌ అల్‌ మసౌద్‌, బెంట్లే బెంటాయాగా కార్‌ని గెల్చుకున్నారు. ఆస్ట్రేలియా జాతీయుడైన ఆండ్రూ బోక్సాల్‌, ఇండియన్‌ స్కౌట్స్‌ మోటార్‌ బైక్‌ని గెలుపొందారు.

Back to Top