దీపావళి వేడుకల్లో అపశృతి.. టపాకాయలు కాలుస్తూ.. 30 మంది..

- November 07, 2018 , by Maagulf
దీపావళి వేడుకల్లో అపశృతి.. టపాకాయలు కాలుస్తూ.. 30 మంది..

వెలుగుల దీపావళి కొందరి జీవితాల్లో చీకట్లు నింపింది. బాణాసంచా కాలుస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో..కొందరు తీవ్రంగా గాయపడగా.. మరికొందరు కళ్లు కోల్పేయే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో టపాకాయలు కాలుస్తూ.. ప్రమాదానికి గురైన 30 మంది సరోజిని కంటిని ఆసుపత్రిలో చేరారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. అటు ఏపీలోనూ దీపావళి సంబారాల్లో గాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో.. దీపావళి పండుగ వేడుకల్లో పలు చోట్ల అపశృతి చోటుచేసుకుంది. టపాకాయలు కాలుస్తూ అనేక మంది ప్రమాదానికి గురయ్యారు. ఇలా.తీవ్రంగా గాయపడిన అనేక మంది… హైదరాబాద్‌లోని సరోజినిదేవి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాధితులు కళ్లకు గాయాలతో… కంటి ఆసుపత్రిలో చేరుతున్నారు. కొందరికి కళ్లు పోయే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు.

ప్రస్తుతం.. సరోజిని దేవి ఆసుపత్రిలో.. 30 మంది చేరినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో నలుగురి పరిస్థితి మరింత విషమంగా ఉండగా.. ఇద్దరికి కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. బాణాసంచా కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు వైద్యులు.

ఇటు..ఏపీలోనూ ఇదే పరిస్థితి!. టపాకాయలు కాలుస్తూ.. అనేక మంది గాయపడ్డారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా బాడంగి మండలంలో దీపావళి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడు గ్రామాల్లో బాంబులు పేలడంతో ముగ్గురికి చేతి వ్రేలు కట్టవ్వగా… నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని బాడంగి సిహెచ్‌సి లో చేర్పించారు. వీరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు.

మెదక్‌ జిల్లా ఉద్దేమర్రి గ్రామంలో ఇంటి ముందుకు దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం జరిగింది. పెట్రోల్ అమ్మకాలు సాగించే షాపు కావడంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షాపుతో సహా ఇంటిలో సామాను కాలిపోయింది. పండగ రోజు ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో కట్టు బట్టలతో కుటుంబం రోడ్డున పడింది.

అటు హైదరాబాద్ మల్కాజిరిగిలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. అనుమతి లేకుండా టపాకాయలు అమ్ముతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే… ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు తెలిపారు.

దీపావళి సంబరాలు ఓ నిరు పేద ఇంట్లో విషాదం నింపింది. బాణాసంచ కాలుస్తుండగా ఓ తారజువ్వ వచ్చి పడటంతో పూరిల్లు తగలబడిపోయింది. కృష్ణా జిల్లా తిరువూరు మండలం అక్కపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగర్ల బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోయింది.

ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి రోజున కొందరు గాయపడటం, మరికొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com