ఏవియేషన్‌ ఫ్యూయల్‌ సర్వీసెస్‌ హబ్‌గా బహ్రెయిన్‌!

ఏవియేషన్‌ ఫ్యూయల్‌ సర్వీసెస్‌ హబ్‌గా బహ్రెయిన్‌!

బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ కొత్త ఫ్యూయల్‌ ఫార్మ్‌ కాంప్లెక్స్‌, 2019 మధ్య నాటికి రీజియనల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌ సర్వీసెస్‌ హబ్‌గా కింగ్‌డమ్‌ స్టేటస్‌ని పెంచనుంది. డెవలపర్‌, బిఎసి జెట్‌ ఫ్యూయల్‌ కంపెనీ (బిజెఎఫ్‌సిఓ),బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో (2018)లో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఏవియేషన్‌ ఫ్యూయల్‌ సప్లయ్‌ మరియు ప్రాసెస్‌ని బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం వద్ద ఎలా స్ట్రీమ్‌లైన్‌ చేయగలుగుతుందీ వివరించనుంది. అలాగే 30,000 క్యూబిక్‌ మీటర్స్‌ స్టోరేజ్‌ కెపాసిటీకి దీన్ని విస్తరించడం జరిగింది. కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా నేతృత్వంలో, బిఐఎఎస్‌ సుప్రీమ్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా పర్యవేక్షణలో బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో 2018 నవంబర్‌ 14 నుంచి 16 వరకు సఖిర్‌ ఎయిర్‌ బేస్‌లో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మరియు టెలికమ్యూనికేషన్స్‌, రాయల్‌ బహ్రెయిన్‌ ఎయిర్‌ పోర్స్‌ - ఫార్న్‌బారో ఇంటర్నేషనల్‌ సహకారంతో ఈ షో నిర్వహిస్తున్నారు. 

 

Back to Top