యూఏఈలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

యూఏఈలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

యూఏఈ అంతటా దీపావళి పండుగ సందర్భంగా వెలుగులు విరజిమ్మాయి. యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, దీపావళి వేడుకల కోసం రెసిడెంట్స్‌కి పిలుపునిచ్చారు. అలాగే షేక్‌ మొహ్మద్‌ హిందీలోనూ, ఇంగ్లీషులోనూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రజల తరఫున భారత ప్రధాని నరేంద్రమోడీకీ, భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు షేక్‌ మొహమ్మద్‌. దీపావళి ఫొటోల్ని, వీడియోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని కూడా షేక్‌ మొహమ్మద్‌ పిలుపునిచ్చారు. ఇదిలా వుంటే, షేక్‌ మొహమ్మద్‌ శుభాకాంక్షల పట్ల స్పందించిన భారత ప్రధాని నరేంద్రమోడీ, అరబిక్‌ అలాగే ఇంగ్లీషులలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దుబాయ్‌ అంతటా దీపావళి సెలబ్రేషన్స్‌ అంగరంగ వైభవంగా జరిగాయి. దీప కాంతులతో దుబాయ్‌ వెలిగిపోయింది. రంగోలీ డిజైన్స్‌, దీపాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంపిక చేసిన ప్రత్యేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫైర్‌ వర్క్‌ షో నిర్వహించగా, వీటిని తిలకించేందుకు పెద్దయెత్తున సందర్శకులు పోటెత్తారు. 

Back to Top