దుబాయ్ లో దీపావళి

దుబాయ్: దీపావళి..ఈ పండగ అంటే పిల్లలతో సమానంగా పెద్దలు కూడా ఎంతో ఆనందంతో దీపాలు పెట్టి బాణాసంచా కాల్చి ఉల్లాసంగా జరుపుకునే పండగ. భారతదేశంలో దీపావళి జరుపుకోవటం ఎంత ఆనందదాయకమో అంతకంటే రెట్టింపు ఉంత్సాహం విదేశాల్లో జరుపుకోవటం. యూఏఈ లోని దుబాయ్ టూరిజం వారు దుబాయ్ లోని 'అల్ సీఫ్' లో నిర్వహించిన దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో ఎందరో తెలుగు వారు పాల్గొన్నారు. 

దుబాయ్ లోని తెలుగు ఆడపడుచులు ముందుగా తమ ముంగిళ్ళల్లో రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్ది, లక్ష్మి పూజలు చేసుకొని, ఎంతో అందంగా ముస్తాబై 'అల్ సీఫ్' లో  తమ కుటుంబ మరి స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లంసగా దీపావళి జరుపుకున్నారు. దుబాయ్ ప్రభుత్వం ఇలా మన సంప్రదాయాలకు విలువ ఇచ్చి సంబరాలు చేసుకోవటం అభినందించదగ్గదని మరియు అందులో పాల్గొనటం ఆనందగంగా ఉందని దుబాయ్ ప్రభుత్వానికి ధనవ్యవాదాలు తెలియజేసారు.

Back to Top