స్మగ్లింగ్‌ యత్నం: వలసదారుడికి జైలు

- November 08, 2018 , by Maagulf
స్మగ్లింగ్‌ యత్నం: వలసదారుడికి జైలు

బహ్రెయిన్: హై క్రిమినల్‌ కోర్టు, బంగ్లాదేశీ జాతీయుడొకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 5,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించింది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ఆరోపణల నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం ఈ శిక్షలు ఖరారు చేసింది. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడ్ని అరెస్ట్‌ చేసిన అధికారులు, అతని నుంచి కిలోగ్రామ్‌ మరిజువానా, 900 నార్కోటిక్‌ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరిజువానాని స్మోక్‌ చేసేందుకు ఉపయోగించే ఓ వుడెన్‌ టూల్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైలు శిక్ష పూర్తయిన అనంతరం నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఇటీవల తన దేశానికి వెళ్ళిన తాను అక్కడ ఐదు రోజులు వున్నాననీ, అక్కడే మరిజువానాని స్మోక్‌ చేశాననీ, అక్కడ తనను కలిసిన ఓ వ్యక్తి, డ్రగ్స్‌ని తీసుకెళ్ళాల్సిందిగా కోరుతూ, 200 బహ్రెయినీ దినార్స్‌ ఇచ్చాడని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com