పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌: యూఏఈ నెంబర్‌ త్రీ

పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌: యూఏఈ నెంబర్‌ త్రీ

మోస్ట్‌ పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ క్యాటగిరీలో యూఏఈ మూడో స్థానం దక్కించుకుంది. గత నెలలో యూఏఈ ర్యాంకింగ్‌ నాలుగో స్థానంగా వుంది. యూఏఈ ట్రావెల్‌ డాక్యుమెంట్‌ - వీసా ఫ్రీ స్కోర్‌ విభాగంలో 163గా వుంది. యూఏఈ పాస్‌పోర్ట్‌ వున్నవారు 113 దేశాల్లో వీసా-ఫ్రీ విధానంలో తిరిగేందుకు వీలుంది. 50 దేశాలు, వీసా ఆన్‌ ఎరైవల్‌కి అనుకూలంగా వున్నాయి. ఎమిరేటీలు 35 దేశాల్లోకి వెళ్ళేందుకు మాత్రం వీసా అవసరం. పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ ప్రకారం బెల్జియమ్‌, ఆస్ట్రియా, జపాన్‌, గ్రీస్‌, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఐర్లాండ్‌, కెనడాలతో బెర్త్‌ షేర్‌ చేసుకుంటోంది. టాప్‌ లిస్ట్‌లో సింగపూర్‌, జర్మనీ 165 పాయింట్లతో వున్నాయి. అమెరికా, సౌత్‌ కొరియా, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, స్వీడన్‌ తదితర 11 దేశాలకు 162 పాయింట్లతో రెండో స్థానంలో వున్నాయి.

Back to Top