అమెరికాలో పెరిగిన హెచ్‌-1బీ వీసాల నిలుపుదల

- November 09, 2018 , by Maagulf
అమెరికాలో పెరిగిన హెచ్‌-1బీ వీసాల నిలుపుదల

అమెరికాలో హెచ్‌-1బీ వీసాల జారీ నిలుపుదల బాగా పెరిగిపోయిందని 'కంపీట్‌ అమెరికా' అనే సంఘం వెల్లడించింది. ఇందులో గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. యూఎస్‌సీఐఎస్‌ దాని సొంత నిబంధనలను ఉల్లంఘిస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు అధిక సంఖ్యలో హోల్డ్‌లో ఉంటున్నాయని ఫిర్యాదు చేసింది. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయొచ్చు. ఎన్నో ఐటీ కంపెనీలు ఈ వీసాల మీద ఆధారపడి వేలాది మంది విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com