కువైట్‌ను కుదిపేస్తున్న భారీ వర్షాలు

- November 10, 2018 , by Maagulf
కువైట్‌ను కుదిపేస్తున్న భారీ వర్షాలు

కువైట్ సిటీ: గల్ఫ్ దేశం కువైట్‌లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడివారిని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులతోపాటు వలసజీవులకు సూచించారు. బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  వారాంతంలో కుండపోత వర్షాలు కురవనున్నాయని సూచించారు. అత్యవసర నంబర్ 112 సేవలు 24 గంటలపాటు కొనసాగుతాయని, ట్రాఫిక్, ఇతర సమస్యలను వెల్లడించవచ్చునని అధికారులు సూచించారు. కోస్ట్‌గార్డ్ హాట్‌లైన్ నంబర్ 1880888 కి కూడా సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు. వర్షాల కారణంగా దేశం అంతటా ఎమర్జెన్సీ వాతావరణం ఉందన్నారు. ఈ మేరకు కువైట్ ప్రధానమంత్రి షేక్ జబర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉందని, రోడ్లపై ప్రయాణించేవారు జాగ్రత్తగా వెళ్లాలని, అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని సూచించారు. ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని హెచ్చరించారు.

--వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com