రొయ్యలు తింటే కలుగు లాభాలు

- November 12, 2018 , by Maagulf
రొయ్యలు తింటే కలుగు లాభాలు

మనం తీసుకునే ఆహారం పదార్థాల మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామందిలో ఏదోరకమైన అనారోగ్య సమస్య ఉంటూనే ఉంది. దీనికి కారణం మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం లాంటివి కారణమవుతున్నాయి. మాంసాహారమైన రొయ్యలు అనేక రకములైన పోషక విలువలు కలిగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
1. రొయ్యల్లో జింక్ హెచ్చుస్థాయిలో ఉంటుంది. మగవారు వీటిని తీసుకోవడం వలన సంభోగ శక్తిని పెంచడమే కాకుండా వీర్యవృద్ధిని, ఉత్పత్తిని పెంచుతుంది.
 
2. అంతేకాకుండా రొయ్యల్లో కండరాల కదలికకు అవసరమైన మెగ్నీషియం, క్యాల్షియం అధికంగా ఉన్నాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి.
 
3. రొయ్యల్లోని సెలీనియం సంభోగ చర్యలను, వీర్యకణాల సంఖ్యను పెంచి సంతాన సాఫల్యతకు తోడ్పడుతుంది.
 
4. ఫెనిలాలనైన్ అనే ఎమినో యాసిడ్ మనోభావాల్ని నియంత్రిస్తూ శృంగార వాంఛల్ని పెంచుతుంది.
 
5. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ, విటమిన్ బి 12 రొయ్యల్లో లభిస్తాయి. అంతేకాకుండా శరీర నిర్మాణకణాల అభివృద్దికి ఉపకరించేసత్తువ కూడా రొయ్యల్లో ఉంటుంది. వీటిలో తక్కువ క్యాలరీలు ఉండడం వలన బరువు నియంత్రణలో ఉంటుంది.
 
6. రొయ్యల్లోని సెలీనియమ్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. వీటిలో ఉండే ఒమెగా 3 ప్యాటీ ఆసిడ్స్ గుండె రక్త నాళాల్లో పూడికలు రానివ్వదు. 
 
7. రొయ్యలు రుచికరంగా ఉంటాయి కదా అని ఎక్కువ నూనెతో వేయించిన వేపుళ్లను తినకూడదు. తక్కువ నూనెతో చేసిన రొయ్యల కూర, వేపుళ్లు తినవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com