అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు

అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు
షార్జాలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. షార్జా మే సెలూన్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే షార్జా సివిల్‌ డిఫెన్స్‌, సంఘటనా స్థలానికి ఫైర్‌ ఫైటర్స్‌నీ, రెస్క్యూ యూనిట్స్‌నీ పంపించడం జరిగింది. కేవలం ఐదు నిమిషాల్లోనూ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డ ఆసియా మహిళ, ఆమె చిన్నారికి వెంటనే వైద్య సహాయం అందించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. సమాన్‌ అలాగే అల్‌ మినా నుంచి కూడా ఫైర్‌ ఫైటర్స్‌, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 30 మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Back to Top