బహ్రెయిన్‌ చేరుకున్న బ్రేవ్‌ సిఎఫ్‌ అథ్లెట్స్‌

బహ్రెయిన్‌ చేరుకున్న బ్రేవ్‌ సిఎఫ్‌ అథ్లెట్స్‌

బహ్రెయిన్‌:18వ ఎడిషన్‌ బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌ కోసం ప్రొఫెషనల్‌ ఫైటర్స్‌, బహ్రెయిన్‌ చేరుకుంటున్నారు. తొలి ఫైట్‌ ఖలీఫా స్పోర్ట్స్‌ సిటీ - ఇసా టౌన్‌లో నవంబర్‌ 18న జరగనుంది. మూడు ఛాంపియన్‌ షిప్‌ టైటిల్స్‌తో బహ్రెయిన్‌లో అతి పెద్ద ఈవెంట్‌గా ఈ బ్రేవ్‌ ఫైట్‌ జరగనుంది. బ్రేవ్‌ సిఎఫ్‌ అథ్లెట్స్‌కి అమ్వాజ్‌ ఐలాండ్స్‌లో గల్ఫ్‌ సూట్స్‌ కేటాయించారు. ఫైట్‌ ప్రారంభానికి ముందు బహ్రెయిన్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్స్‌టెన్సివ్‌ మీడియా సెషన్స్‌, సెషన్స్‌ ఫర్‌ ఫ్యాన్స్‌ ఇంటరాక్షన్స్‌, మీడియా ఇంటర్వ్యూస్‌, ఓపెన్‌ వర్కవుట్స్‌, పబ్లిక్‌ వెయిట్‌ ఇన్స్‌, మీడియా డే, స్కూల్‌ విజిట్స్‌, ఎంబసీ విజిట్స్‌ వంటి ఈవెంట్స్‌ వుంటాయి. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పెంచేందుకోసం షేక్‌ ఖాలిద్‌ బిన& హమాద్‌ అల్‌ ఖలీఫా తీసుకున్న చర్యల్లో ఈ మెగా ఈవెంట్‌ కూడా ఓ భాగం. 15 దేశాల నుంచి అథ్లెట్స్‌ ఈ ఫైట్‌ కోసం వస్తున్నారు. 

Back to Top