వెదర్‌ అలర్ట్‌: రానున్న రోజుల్లో యూఏఈలో భిన్నమైన వాతావరణం

వెదర్‌ అలర్ట్‌: రానున్న రోజుల్లో యూఏఈలో భిన్నమైన వాతావరణం

యూఏఈలో వాతావరణం రానున్న రోజుల్లో అన్‌ స్టేబుల్‌గా వుండనుందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై వుంటుందనీ, వర్షపాతం ఎక్కువగానే పలు చోట్ల నమోదయ్యే అవకాశం వుందనీ, గాలుల తీవ్రత ఎక్కువగా వుంటుందని బుధవారం వరకూ సముద్రం రఫ్‌గా వుంటుందని ఎన్‌సిఎమ్‌ హెచ్చరించింది. జోర్డాన్‌, కువైట్‌, సౌదీ అరేబియా, ఇరాన్‌లలో వున్నట్లుగా ఇక్కడ ఎక్స్‌ట్రీమ్‌ కండిషన్స్‌ వుండబోవనీ, ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కి అవకాశం లేదని ఎన్‌సిఎమ్‌ వివరించింది. పరిస్థితులు అన్‌ స్టేబుల్‌గా వుండే అవకాశం నేపథ్యంలో, అత్యంత అప్రమత్తంగా వున్నామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో డస్టీ కండిషన్స్‌ ఎక్కువవుతాయి గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. 

Back to Top