దుబాయ్ ఎన్ఆర్ఐ టిడిపి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్

 • రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనల్ని కట్టుబట్టలతో బయటకి గెంటేసారు
 • మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తలసరి ఆదాయం తక్కువ
 • 16 వేల కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్ర ప్రయాణం మొదలు అయ్యింది.
 • రాజధాని కూడా ఎక్కడో తెలియదు.అలాంటి పరిస్థితిలో అమరావతి మన రైతులు 35 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చి చరిత్ర సృష్టించారు.
 • రాష్ట్ర విభజన చేసిన వారు అసూయపడే విధంగా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది.
 • దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా రెండంకెల వృద్ధి సాధించాం.11.22 శాతం వృద్ధి సాధించాం.
 • నదుల అనుసంధానం గురించి దేశం అంతా మాట్లాడారు కానీ ఎవ్వరూ చెయ్యలేదు.ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే గోదావరి,కృష్ణా నదులను అనుసంధానం చేసారు.
 • కరువు ను చూసి రైతులు భయపడే రోజులు పోవాలి.రైతు ను చూసి కరువు. బయపడాలి అని ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
 • దేశ వ్యాప్తంగా 5 లక్షల పంట కుంటలు తవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 10 లక్షల పంట కుంటలు తవ్వామ్.
 • రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేసాం.అందుకే రాష్ట్రానికి పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి.ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒక్కటి అయిన కియా మన రాష్ట్రానికి వచ్చింది.
 • గ్రామాల్లో ఎప్పుడూ లేని విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
 • 14 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసాం.30 లక్షల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసాం.అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీరు అందిస్తాం.
 • ఆంధ్రప్రదేశ్ లో తక్కువ వర్షపాతం ఉన్నా
 • వ్యవసాయ రంగంలో వృద్ధి సాధిస్తున్నాం.హార్టీ కల్చర్,ప్రకృతి వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
 • ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఐటి రంగం మొత్తం హైదరాబాద్ లో ఉండిపోయింది.
 • 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం.
 • విశాఖపట్నం కు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చింది.
 • అమరావతి కి హెచ్ సిఎల్ వచ్చింది.
 • తిరుపతి కి జోహో వచ్చింది.
 • ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాం.
 • ఫాక్స్ కాన్ లాంటి అనేక పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి.
 • దేశంలో తయారు అయ్యే 10 ఫోన్లలో 3 ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో తయారు .అవుతున్నాయి.
 • ఒక్క ఫాక్స్ కాన్ లోనే 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.
 • 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ అమరావతికి ఒక బ్రాండ్ తీసుకొచ్చారు.
 • ఎన్ఆర్ఐ లు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు గా మారి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి ని గురించి ప్రచారం చెయ్యాలి.
 • ఎన్ఆర్ఐ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ఏపీఎన్ఆర్టి ఏర్పాటు చేసాం.
 • తెలుగు వారు ఎక్కడ ఏ సమస్య ఎదుర్కొన్నా, మీ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా.మీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం.
 • బీజేపీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది.
 • ఇచ్చిన ఒక్క హామీ కూడా బీజేపీ నిలబెట్టుకోలేదు.
 • ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి అని నిలదీస్తే బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.
 • ప్రత్యేక హోదా తో పాటు ఒక్క ఇచ్చిన 18 హామీలు నెరవేర్చలేదు.
 • రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది.
 • అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేస్తున్నారు.
 • 2019 ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెలిస్తే దేశ ప్రధాని ఎవ్వరు అవ్వాలి అనేది చంద్రబాబు నిర్ణయించబోతున్నారు.
 • హోదా తో ఇచ్చిన అన్ని హామీలు సాధిస్తాం.
 • ఇప్పటికే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు.వారి అందరినీ నేను అభినందిస్తున్నాను.
 • అనంతరం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యిన ఎన్ఆర్ఐలను సత్కరించిన మంత్రి నారా లోకేష్
 • అనంతరం ఎన్ఆర్ఐలు ఆడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నారా లోకేష్
 • తెలంగాణ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో అక్కడి ప్రజలకి బాగా తెలుసు
 • ఐటీ రంగం ఎవరు అభివృద్ధి చేశారో అందరికి తెలుసు
 • విభజన సమయంలో తెలంగాణకి కూడా అనేక హామీలు ఇచ్చారు.ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.
 • అయినా కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు.
 • తెలుగు వారు అంతా కలిసి ఉండాలి,అభివృద్ధి చెందాలి అనేది మా ఆలోచన

Back to Top