నైజీరియాలో కలరా, 175 మంది మృతి

నైజీరియాలో కలరా, 175 మంది మృతి

నైజీరియాలో కలరా వ్యాధి కరాళ నృత్యం చేస్తోంది. దీని బారిన పడి ఇప్పటివరకు 175 మంది మరణించారు. మరో పదివేల మంది చికిత్స పొందుతున్నారు. బోకోహరామ్‌ తిరుగుబాటు వల్ల ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కిటకిటలాడుతున్న శరణార్థి శిబిరాలు, నైజీరియాలో కురుస్తున్న వరుస కుండపోత వర్షాల వల్ల కలరా మరింతగా ప్రబలుతోంది. క్యాంపుల్లో ప్రజలకు సరైన నీరు, తిండి అందించడానికి కూడా కష్టంగా ఉందని నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌(ఎన్‌ఆర్‌సీ) మేనేజర్‌ జానెట్‌ కెరోనో ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top