రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

మస్కట్‌: ఒమన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నలుగుర్ని బలి తీసుకుందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొన్నారు. వాహనం, రోడ్డుపైనున్న ల్యాంప్‌ పోస్ట్‌లోకి దూసుకుపోవడంతో, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువైంది. సీబ్‌లోని మస్కట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 4 వీల్‌ డ్రైవ్‌ వెహికిల్‌పై అదుపు కోల్పోయిన డ్రైవర్‌, అతి వేగంగా వాహనాన్ని ల్యాంప్‌ పోస్ట్‌ మీదకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో నలుగురు సిటిజన్స్‌ ప్రాణాలు కోల్పోగా, ఒకరికి గాయలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

 

Back to Top