యూఏఈలో డెడ్లీ స్నేక్‌

- November 14, 2018 , by Maagulf
యూఏఈలో డెడ్లీ స్నేక్‌

యూఏఈ రెసిడెంట్స్‌, పెరుగుతున్న పాములతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మినా అల్‌ అరబ్‌లోని ఓ ఇంట్లో యూరోపియన్‌ జాతీయుడికి అతి ప్రమాదకరమైన సా స్కేల్డ్‌ వైపర్‌ స్నేక్‌ కన్పించింది. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి, తన స్నేహితుల సాయంతో వైపర్‌ కాటు నుంచి తప్పించుకున్నారు. రస్‌ అల్‌ ఖైమా యానిమల్‌ వెల్ఫేర్‌ సెంటర్‌కి సమాచారం ఇవ్వగా, సిబ్బంది వచ్చిన ఆ స్నేక్‌ని తమ వెంట తీసుకెళ్ళారు. రస్‌ అల్‌ ఖైమా యానిమల్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ మెడికల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఛెంజెరాయ్‌ సిగాకె మాట్లాడుతూ, భూమ్మీద అత్యంత విషపూరితమైన పాముల్లో సా స్కేల్డ్‌ వైపర్‌ కూడా ఒకటని అన్నారు. అరబ్‌ దేశాలతోపాటు పాకిస్తాన్‌, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ పాము ఆచూకీ కన్పిస్తుంటుంది. రాత్రి వేళల్లో ఈ పాము చాలా యాక్టివ్‌గా వుంటుంది. కొన్ని నెలల క్రాతం జుల్ఫార్‌ ఏరియాలో రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ ఓ పాముని పట్టుకుని చంపేయడం జరిగింది. పాముల విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, పాముల ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారమివ్వాలని అధికారులు అంటున్నారు. సా స్కేల్డ్‌ వైఫర్స్‌ ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో వుంటాయి. ఇవి రెసిడెన్షియల్‌ ఏరియాలవైపు వెళుతుంటాయి. నీటి కోసం, ఆహారం కోసం జనవాసాల్లోకి వస్తుంటాయివి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com