హలో నాని.. హూఈజ్ నాని..!

- November 15, 2018 , by Maagulf
హలో నాని.. హూఈజ్ నాని..!

సినిమాల్లో హీరోల డ్యూయల్ రోల్స్ చాలానే చూస్తుంటాం.. సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే తండ్రి కొడుకులుగానే నటిస్తుంటారు హీరోలు. కానీ నిజజీవితంలో హీరో, తన కొడుకు సేమ్ టూ సేమ్ ఉంటే ఎలా ఉంటుంది. వారిని చూస్తుంటే  అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది కదా..! ఇప్పుడు మన నేచురల్ స్టార్ నాని అలాంటి ఫోటోనే షేర్ చేశాడు.

నాని తన చిన్నతనంలో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు తన కొడుకు అచ్చం అలాగే ఉన్నాడు. ఇలాంటి ఓ ఫోటోను బాలల దినోత్సవం సందర్భంగా నాని తన ట్విట్టర్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. తన చిన్నప్పటి ఫొటోతో పాటు తన కొడుకు అర్జున్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నాని ‘మేమిద్దరం ఒకేలా ఉన్నాం.. నిజజీవితంలో డ్యూయల్‌ రోల్‌’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. నిజంగా ఇందులో నాని ఎవరు.. వాళ్ల బాబు అర్జున్ ఎవరో గుర్తుపట్టడం కష్టం. దీంతో ఈ ఫోటోను నెటిజన్లు రీట్వీట్ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com