ఫేస్ బుక్ లో మెసేజ్ 'అన్ సెండ్' ఫీచర్

- November 15, 2018 , by Maagulf
ఫేస్ బుక్ లో మెసేజ్ 'అన్ సెండ్' ఫీచర్

ఫేస్ బుక్ కొంత కాలంగా తన మెసెంజర్ లో 'అన్ సెండ్' ఫీచర్ జోడించడం గురించి చెబుతోంది. ఇప్పుడు ఈ ఫీచర్ ను ఫేస్ బుక్ యూజర్ల అందుబాటులోకి తెచ్చింది. అన్ సెండ్ ఫీచర్ లో విశేషం ఏంటంటే యూజర్ తన చాట్ నుంచి పంపిన మెసేజ్ లను డిలిట్ చేయవచ్చు. మునుపు ఇలా చేసే వీలుండేది కాదు. మొదట యూజర్లు తమ మెసేజ్ లను డిలిట్ చేస్తే అది కేవలం వారి చాట్ బాక్స్ నుంచి మాత్రమే డిలిట్ అయ్యేది. కొత్త ఫీచర్ కారణంగా యూజర్లు మెసేజ్ డిలిట్ చేస్తే వారి చాట్ నుంచే కాకుండా మెసేజ్ పొందినవారి ఇన్ బాక్స్ నుంచి కూడా డిలిట్ అయిపోతుంది.

ఫేస్ బుక్ నుంచి పంపిన మెసేజ్ లను డిలిట్ చేయడానికి 10 నిమిషాల సమయం ఉంటుంది. అంటే యూజర్ ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి పంపితే దానిని 10 నిమిషాల్లోగా అన్ సెండ్ చేయవచ్చు. అన్ సెండ్ ఫీచర్ ద్వారా యూజర్లు చాట్ తో పాటు ఫోటోలు, వీడియోలను కూడా డిలిట్ చేయవచ్చు. భవిష్యత్తులో ఏదైనా వేధింపుల ఫిర్యాదు వస్తే అందజేసేందుకు వీలుగా ఫేస్ బుక్ అన్ సెండ్ చేసిన మెసేజ్ ల కాపీని కొంత కాలం పాటు తన దగ్గర ఉంచుతుంది.

ప్రస్తుతం ఫేస్ బుక్ ఈ ఫీచర్ ను బొలీవియా, పోలాండ్, కొలంబియా, లిథువేనియా వంటి దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే భారత్ తో సహా మిగతా దేశాలన్నిటిలో వాడుకలోకి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ ఫీచర్ ను ఉపయోగించేందుకు యూజర్ తను పంపిన మెసేజ్ పై ట్యాప్ చేసి కొంతసేపు హోల్డ్ చేస్తే చాలు. వెంటనే Remove for everyone ఆప్షన్ వస్తుంది. దానిని ట్యాప్ చేస్తే యూజర్ తను పంపిన మెసేజ్ డిలిట్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com