నింగిలోకి దూసుకెళ్ళిన యూఏఈ శాటిలైట్‌

- November 17, 2018 , by Maagulf
నింగిలోకి దూసుకెళ్ళిన యూఏఈ  శాటిలైట్‌

యూఏఈ విద్యార్థులు తయారు చేసిన నానో శాటిలైట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. వర్జీనియాలోని మిడ్‌ అట్లాంటిక్‌ రీజినల్‌ స్పేస్‌పోర్ట్‌ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. సిగ్నస్‌ ఎన్‌సి10 ఫ్లైట్‌ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్ళింది. నవంబర్‌ 15న ముందుగా ఈ శాటిలైట్‌ని ప్రయోగించాలనుకున్నా, కొన్ని కారణాలతో రెండు రోజులు ఆలస్యంగా అంటే నవంబర్‌ 17న లాంఛ్‌ చేశారు. ఎడ్యుకేషనల్‌ అవసరాల కోసం ఈ నానోశాటిలైట్‌ని రూపొందించారు. దీంట్లో ఓ కెమెరా భూమిని అబ్జర్వేషన్‌ చేయడానికి ఉపయోగపడ్తుంది. మస్దార్‌ ఇన్‌స్టిట్యూట్‌ దీన్ని డెవలప్‌ చేసింది. నెల రోజుల్లో యూఏఈ నిర్మించిన రెండో స్పేస్‌ ఆబ్జెక్ట్‌గా దీన్ని అభివర్ణించొచ్చు. ఇటీవలే ఖలీఫా శాటిలైట్‌ని జపాన్‌ నుంచి ప్రయోగించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com