మ్యూజియం ఆఫ్‌ ఫ్యూచర్‌ స్ట్రక్చర్‌ పూర్తి

- November 20, 2018 , by Maagulf
మ్యూజియం ఆఫ్‌ ఫ్యూచర్‌ స్ట్రక్చర్‌ పూర్తి

దుబాయ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌, మ్యూజియమ్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌ బేసిక్‌ స్ట్రక్చర్‌ పూర్తయినట్లు వెల్లడించింది. మినిస్టర్‌ ఆఫ్‌ క్యాబినెట్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఫ్యూచర్‌, డిఎఫ్‌ఎఫ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ వైస్‌ ఛైర్మన్‌, డిఎఫ్‌ఎఫ్‌ డైరెక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ గర్గావి మాట్లాడుతూ, ఈ మ్యూజియం శాస్త్రవేత్తలకు ఓ మంచి డెస్టినేషన్‌ లాంటిది కానుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న సైంటిస్టులు ఎక్స్‌పర్ట్స్‌, ఇన్నోవేటర్స్‌, క్రియేటివ్‌ మైండ్స్‌కి ఈ ఫ్యూచర్‌ మ్యూజియం ఓ మంచి వేదిక అని అన్నారు. 2020లో ఈ మ్యూజియం సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని గర్గావి అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌కి ఈ మ్యూజియం ఐకాన్‌ కాబోతోంది. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com