అతిపెద్ద కార్ డాన్స్ లో ప్రపంచ రికార్డు సాధించిన దుబాయ్

అతిపెద్ద కార్ డాన్స్ లో ప్రపంచ రికార్డు సాధించిన దుబాయ్

దుబాయ్: ఎప్పుడు ఎదో ఒక ఆకర్షణతో వార్తల్లో ఉండే దుబాయ్ మరోసారి ప్రపంచ రికార్డు లో స్థానం సంపాదించి తన సత్తా చాటుకుంది..జాతీయ చిహ్నం ఐన 'ఫాల్కన్' చుట్టుగీతపై 180 Nissan patrol 4x4 కార్లు రెండు వరుసలలో ఎదురుబొదురుగా 1,476 మీటర్ల దూరాన్ని చుట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమం Dubai Rugby 7s stadium లో తమ మునిపటి రికార్డు ను కొల్లగొడుతూ సాధించటం విశేషం. ఈ రికార్డ్ అంతర్జాతీయ రేసింగ్ డ్రైవర్ Axcil Jefferies ఆధ్వర్యం లో నిర్వహించారు.

Back to Top