ఇన్‌స్టాకీ కష్టాలు.. ఫేక్ లైక్స్‌కి..

ఇన్‌స్టాకీ కష్టాలు.. ఫేక్ లైక్స్‌కి..

సోషల్ మీడియాలో తక్కువ మంది వాడేది.. ఎక్కువగా సెలబ్రెటీలు వినియోగించే ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్. అయితే దీనిక్కూడ ఫేస్‌బుక్‌లానే నకిలీ లైక్స్, నకిలీ ఫాలోయర్లు ఎక్కువైపోయారు. ఇన్‌స్టాకి ఉన్న ఇమేజ్ తగ్గిపోతుంది. దీంతో ఇన్‌స్టా యాజమాన్యం మేల్కొని యూజర్లలో పలుచన కాకూడదనే ప్రయత్నాలు ప్రారంభించింది.

యూజర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించింది. ఈ రోజునుంచే నకిలీ లైక్స్‌ని, నకిలీ ఫాలోయర్స్‌ని ఏరివేసే పనిలో పడినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో నడిచే స్పెషల్ లెర్నింగ్ టూల్స్ తయారు చేసుకుంది. దీనిలో భాగంగానే యూజర్లకు ‘ఇన్-యాప్’ మెసేజెస్ పంపనుంది. ఈ దెబ్బతో థర్డ్ పార్టీల ద్వారా ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోయర్లను ఏర్పాటు చేసుకునే వారందరికి పెద్ద షాక్ తగిలినట్టవుతుంది.

Back to Top