దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకున్న భారతీయ వలసదారుడు

దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకున్న భారతీయ వలసదారుడు

దుబాయ్‌కి చెందిన భారతీయ వలసదారుడు నౌషద్‌ సుబిర్‌, తాజా దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రాఫెల్ విజేతగా నిలిచారు. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ ప్రమోషన్‌లో భాగంగా టిక్కెట్‌ 0520 టిక్కెట్‌ సిరీస్‌ 286 ఈ బహుమతిని నౌషద్‌ సుబీర్‌కి అందించింది. ఆన్‌లైన్‌లో సుబీర్‌ ఈ టిక్కెట్‌ని కొనుగోలు చేశారు. తాను పనిచేస్తున్న రెడా గ్రూప్‌కి చెందిన మరో తొమ్మిది మందితో కలిసి ఈ టిక్కెట్‌ ధరని షేర్‌ చేసుకున్నారు సుబీర్‌. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకోవడంపై సుబీర్‌ మాట్లాడుతూ, ఈ గెలుపుతో తామంతా లక్కీ అని ప్రూవ్‌ అయ్యిందని చెప్పారు. దుబాయ్‌లో 20 ఏళ్ళుగా సుబీర్‌ నివసిస్తున్నారు. ఈ రాఫెల్ గెల్చుకోవడం ద్వారా సుబీర్‌ ఈ ఘనతను సాధించిన 137వ ఇండియన్‌గా రికార్డులకెక్కారు. ఇండియాకే చెందిన పర్వీన్‌ షేక్‌ ఆసిఫ్‌ అనే 43 ఏళ్ళ వ్యక్తికి బిఎండ్బ్యుల ఆర్‌ 1200 ఆర్‌ మోటార్‌ బైక్‌ ఈ రాఫెల్లో దక్కింది. 

 

Back to Top