ఫ్లాగ్‌ పోల్‌ రోప్‌ మెడకు చుట్టుకుని మూడేళ్ళ చిన్నారి మృతి

ఫ్లాగ్‌ పోల్‌ రోప్‌ మెడకు చుట్టుకుని మూడేళ్ళ చిన్నారి మృతి

ఫ్లాగ్‌పోల్‌ రోప్‌, మూడేళ్ళ చిన్నారి ప్రాణం తీసేసింది. ఈ ఘటన ఫుజారియాలో చోటు చేసుకుంది. తన ఇంటి బయట వున్న యార్డ్‌లో ఆ చిన్నారి ఆడుకుంటుండగా, దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, అక్కడికి అంబులెన్స్‌ మరియు పెట్రోల్‌ చేరుకున్నాయి. మెడకు చుట్టుకున్న ఫ్లాగ్‌పోల్‌ రోప్‌ని జాగ్రత్తగా తీసి, చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు. చట్టపరమైన చర్యల అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 
 

Back to Top