మాలధారణలో శర్వానంద్.. ఎంతో నిష్టగా పడిపూజ

- November 28, 2018 , by Maagulf
మాలధారణలో శర్వానంద్.. ఎంతో నిష్టగా పడిపూజ

కార్తీక మాసం ఎంతో పవిత్రం. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈనెలలోనే అయ్యప్పమాల వేసుకుని స్వాములు భజనలు చేస్తుంటారు. మాల వేసుకున్న స్వాముల ఇళ్లు కూడా దేవాలయాలను తలపిస్తుంటాయి. ఇంట్లోని వారు కూడా ఎంతోనిష్టగా, భక్తి శ్రద్ధలతో స్వాములకు ప్రసాదాలు వండి పెడుతుంటారు.

వారు కూడా భగవన్నామస్మరణలో పునీతులవుతుంటారు. వృత్తిలో భాగంగా షూటింగులతో బిజీగా ఉన్నా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు అయ్యప్పమాల వేసుకుని శ్రద్ధాభక్తులతో అయ్యప్పని పూజిస్తుంటారు. ఈసారి కూడా హీరోలు రాంచరణ్, శర్వానంద్‌లు మాల వేసుకున్నారు.

ప్రతి సంవత్సరం మాల వేసుకుని 41 రోజులు దీక్ష తీసుకుని శబరిమల వెళ్లి అయ్యప్పని దర్శించి వస్తుంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న దైవ సన్నిధిలో శర్వానంద్ మహాపడి పూజ నిర్వహించారు. అయ్యప్పస్వామికి
పూజలు చేశారు. ఈ మహాపడిపూజలో పలువురు స్వాములు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజాదిక కార్యక్రమాలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com