అమెరికాను హెచ్చరించిన వాతావరణ శాఖ

- November 28, 2018 , by Maagulf
అమెరికాను హెచ్చరించిన వాతావరణ శాఖ

మధ్య అమెరికాను మంచుతుఫాన్ వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈశాన్య మిస్సోరి, మిచిగాన్, చికాగో ప్రాంతాల్లో భారీగా మంచు పడుతుండటంతో జనజీవనం స్థంభించింది. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వాణిజ్య, వ్యాపార, కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి.

ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మంచుతోపాటు భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో ధ్యాంక్ గివింగ్ హాలిడే సందర్బంగా బయటకు రాకుండా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో చికాగోలో 13 అంగులాల మంచు కురిసిందని అధికారులు తెలిపారు. 3లక్షల 40వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

రోడ్లపై పెద్ద ఎత్తున మంచు కూరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగిస్తూ రాకపోకను పునరుద్ధరిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

కేన్సస్‌ మిస్సోరి, నెబ్రస్కాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల ఆరు నుంచి 10 అంగుళాల మందంలో మంచు కురిసింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. 16 వందల విమాన సర్వీసులు రద్దు కాగా, 15 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. షికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అత్యధికంగా 770 విమానాలు, కేన్సస్‌ సిటీ నుంచి 187, షికాగో మిడ్‌వే నుంచి 124 విమానాలు రద్దయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com